News May 2, 2024

ఇద్దరు BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

image

TG: మేడ్చల్, జనగామ BRS MLAలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. బ్యాంక్ ఖాతా లేకపోయినా IT రిటర్న్స్ ఎలా దాఖలు చేశారని మల్లారెడ్డి ఎన్నికను కాంగ్రెస్ నేత వజ్రేశ్ సవాల్ చేశారు. జనగామ MLA పల్లా ఎన్నికపై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిటిషన్ వేశారు.

Similar News

News December 25, 2024

విచిత్రం: మగ టీచర్‌కు ప్రసూతి సెలవు మంజూరు

image

బిహార్ విద్యాశాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా విచిత్రంగా ఆయనకు మంజూరయ్యాయి. దీంతో ఆయన 8 రోజులపాటు మెటర్నిటీ లీవ్‌లను ఎంజాయ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామన్నారు.

News December 25, 2024

క్రీడా అవార్డుల్లో కేంద్రం వివక్ష: హర్వీందర్ సింగ్

image

ఖేల్‌రత్న అవార్డులకు నామినేట్ చేసే విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న <<14970210>>మనూ భాకర్ తండ్రి విమర్శల<<>> నడుమ పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ విజేత హర్వీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అవార్డుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో విజేతలకు ఖేల్ రత్న ఇచ్చారు. పారిస్ పారాలింపిక్స్‌లో విజేతలకు ఎందుకు ఇవ్వట్లేదు? ’ అని Xలో ప్రశ్నించారు.

News December 25, 2024

రేపటి టెస్టులో రోహిత్ ఓపెనింగ్!

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. యశస్వీతో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని, కేఎల్ రాహుల్ మూడో స్థానంలో వస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సుందర్ వస్తారని తెలుస్తోంది.