News August 12, 2024

కేటీఆర్‌పై కేసులో హైకోర్టు స్టే

image

TG: మేడిగడ్డ పర్యటనలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని <<13833888>>కేటీఆర్‌పై<<>> నమోదైన కేసులో హైకోర్టు స్టే విధించింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు.

Similar News

News September 19, 2024

రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమం

image

AP: రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో పర్యటించనున్నారు.

News September 19, 2024

హాఫ్ సెంచరీతో మెరిసిన జడేజా

image

భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి బ్యాటు ఝళిపించారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో క్లిష్ట సమయంలో హాఫ్ సెంచరీ 50 (73బంతుల్లో) చేశారు. 144 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మరో సీనియర్ ఆల్‌రౌండర్ అశ్విన్‌తో (73*) కలిసి ఆదుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 272/6గా ఉంది.

News September 19, 2024

నాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇవ్వాలి: జెత్వానీ

image

AP: తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి సినీ నటి జెత్వానీ ధన్యవాదాలు తెలిపారు. హోంమంత్రి అనితతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఎదురైన పరిస్థితులు మరెవ్వరికీ రాకూడదన్నారు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరారు. తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని పరిహారం కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జెత్వానీ వ్యవహారంలో ముగ్గురు IPSలపై ప్రభుత్వం వేటు వేసింది.