News August 16, 2024
బెంగాల్ యంత్రాంగంపై హైకోర్టు మొట్టికాయలు
RGకర్ ఆస్పత్రిపై మూకదాడిని ఆపడంలోరాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. ప్రాంగణం వద్ద 7000 మంది గుమిగూడారని, బారికేడ్లు దాటుకొని వచ్చారని పోలీసులు చెప్పగా.. ఘటనను ఎందుకు అంచనా వేయలేదని, 144 సెక్షన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. ఘటన పూర్వాపరాలపై 2 వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలని ఆస్పత్రి ఇన్‌ఛార్జ్‌ను ఆదేశించింది. తర్వాతి విచారణకు వైద్య నేతలు రావాలని సూచించింది.
Similar News
News September 8, 2024
వినాయక చవితి వేడుకల్లో బంగ్లాదేశ్ క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో తన నివాసంలో గణేషుడి ప్రతిమకు పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ‘గణపతి బొప్ప మోరియా’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దాస్ సెంచరీతో ఆకట్టుకున్నారు.
News September 8, 2024
రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనా ఇదే..
AP: రాష్ట్రంలో వరదల వల్ల రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా R&B రూ.2164.5 కోట్లు, నీటివనరులు రూ.1568.5 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.1160 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖ రూ.481 కోట్లు, వ్యవసాయం రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్ల విభాగం రూ.167.5 కోట్లు, మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.
News September 8, 2024
నిలబడి నీళ్లు ఎందుకు తాగకూడదంటే?
నీరు మనిషి శరీరానికి గొప్ప ఇంధనం. ప్రతి ఒక్కరూ రోజుకు 4లీటర్లు తాగడం చాలా అవసరం. అయితే నీళ్లు ఎలా తాగుతున్నామనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలతోపాటు జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది. అదే కూర్చొని తాగితే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్డ్స్‌గా ఉండి బాడీకి అవసరమైన ఖనిజాలూ అందుతాయి.