News August 24, 2024
ప్రజల దృష్టిని మరల్చేందుకు హై’డ్రామా’: BRS

TG: రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ నాటకానికి తెరలేపారని BRS విమర్శిస్తోంది. చెరువుల స్థలాల్లో నిర్మించిన మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లను, ఫామ్ హౌస్‌లను కూల్చేస్తారా? అని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇవాళ కూల్చిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోనే 2015లో రేవంత్ రెడ్డి తన కూతురి ఎంగేజ్‌మెంట్ జరిపారని గుర్తు చేస్తున్నారు.
Similar News
News March 12, 2026
OTD: భారతదేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఉగ్రదాడి!

భారత్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లకు నేటితో 33 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజున దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ ముఠా జరిపిన 12 పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 1,400 మంది క్షతగాత్రులయ్యారు. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, ఎయిర్ ఇండియా భవన్ వంటి కీలక ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ మారణహోమం నేటికీ దేశాన్ని కలచివేస్తోంది. దోషి యాకూబ్ మెమన్‌ను 2015లో ఉరితీశారు.
News March 12, 2026
మోనాలిసా పెళ్లిపై డైరెక్టర్ సంచలన కామెంట్స్

కుంభమేళా వైరల్ బ్యూటీ <<19356893>>మోనాలిసా<<>> పెళ్లిపై ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆ అమ్మాయిని నేను గంగామాత అవతారంగా భావిస్తాను. ఆమెతో సినిమా కోసం నేను రూ.10 కోట్లు లోన్ తీసుకున్నాను. జైలుకు కూడా వెళ్లాను. కానీ ఇప్పుడు ఓ ముస్లింతో పారిపోయింది. మొత్తం నాశనం చేసింది. ఇది తిరుగుబాటు కాదు. లవ్ జిహాద్. జైలు బయట వాళ్ల నాన్న ఏడ్చినా ఆమె పట్టించుకోలేదు’ అని తెలిపారు.
News March 12, 2026
విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమ

TG: రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25కు గాను స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజు కింద వారి ఖాతాల్లో రూ.374 కోట్లు జమ చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.201 కోట్లు, రాష్ట్రం వాటా రూ.173 కోట్లు. ఈ మొత్తంతో 83,239 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరింది.


