News April 17, 2024
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణలో ఇవాళ ఎండ దంచికొట్టింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత రికార్డైంది. నల్గొండ జిల్లాలోని నిడమనూర్లో 44.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రజలు ఎండవేడిమితో అల్లాడిపోయారు. అయితే అనూహ్యంగా సాయంత్రానికి మబ్బులు కమ్ముకొని, కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రానున్న 2 రోజులు కూడా విపరీతమైన ఎండలు కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 24, 2025
నల్గొండ: ముగిసిన టెండర్లు.. 27న లక్కీ డ్రా!

జిల్లాలో 154 మధ్య దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న ఒక్కరోజు 253 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. NLG (01-38 షాపు నెంబర్స్) 1417, MLG (39-64) 988, DVK (65-86) 621, NKL (87-104) 512, CDR (105-118) 398, హాలియా (119-138) 509, నాంపల్లి (139-154) 460 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 27న లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 24, 2025
మార్కాపురంలోకి శ్రీశైలం?.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు

AP: ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల(D) కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల(D) నుంచి తిరిగి ప్రకాశం(D)లో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం.
News October 24, 2025
అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

అయోడిన్ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అయోడిన్ను గ్రహించి, దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. ఇది తగ్గితే శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం, శ్వాస, గుండెవేగం, జీవక్రియ దెబ్బతింటాయి. అయోడిన్ లోపిస్తే గాయిటర్, రొమ్ముల్లో క్యాన్సర్ రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


