News April 17, 2024
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఇవాళ ఎండ దంచికొట్టింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత రికార్డైంది. నల్గొండ జిల్లాలోని నిడమనూర్‌లో 44.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రజలు ఎండవేడిమితో అల్లాడిపోయారు. అయితే అనూహ్యంగా సాయంత్రానికి మబ్బులు కమ్ముకొని, కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రానున్న 2 రోజులు కూడా విపరీతమైన ఎండలు కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 9, 2024
ఎంపాక్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
దేశంలో తొలిసారి ఎంపాక్స్ అనుమానితుడిని గుర్తించడంతో కేంద్రం రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఎంపాక్స్‌పై ప్రజల్లో అనవసర భయాలు లేకుండా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లాల్లో ప్రజారోగ్య సౌకర్యాల స్థాయిపై సమీక్షించాలని, అనుమానితుల గుర్తింపు-ఐసోలేషన్ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. కేసులు నమోదు కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
News September 9, 2024
పారాలింపియన్ల అంకితభావం స్ఫూర్తిదాయకం: జగన్
పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లకు, పతక విజేతలకు వైసీపీ చీఫ్ జగన్ అభినందనలు తెలిపారు. పారాలింపియన్ల అంకితభావం, ప్రతిభ అద్భుతమని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. తాజాగా ముగిసిన పారాలింపిక్స్‌లో భారత్ 29(గోల్డ్ 7, సిల్వర్ 9, బ్రాంజ్ 13) పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
News September 9, 2024
విధి వెక్కిరించినా భార్య తోడైంది!
పారాలింపిక్స్‌లో నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు చెందిన హోకాటో హోటోజే సెమా కాంస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. రైతు కుటుంబంలో జన్మించిన సెమా బాంబు పేలుడులో కాలు కోల్పోయినా ఆత్మవిశ్వాసం వీడలేదు. సతీమణి సహకారంతో తన కల సాకారం చేసుకున్నారు. ఆమె వల్లే మెడల్ గెలిచానని ఆయన పేర్కొన్నారు. తన భార్య ఎంతో త్యాగం చేసిందని, ఆమె ఆకలితో ఉండి తనకు ఆహారం పెట్టడం వల్లే శిక్షణ కొనసాగించినట్లు సెమా తెలిపారు.