News April 30, 2024
కూటమి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

AP: టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ఆయా పార్టీల అధినేతలు రిలీజ్ చేశారు. వాటిలో ముఖ్యమైనవి..
✒ ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15,000
✒ దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఫ్రీ
✒ రైతులకు ఏడాదికి రూ.20వేల పెట్టుబడి సాయం
✒ నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి
✒ ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 ✒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం
Similar News
News January 21, 2026
మిర్చికి రికార్డ్ స్థాయిలో ధర

గుంటూరు మిర్చి మార్కెట్‌లో ఇవాళ రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. యార్డుకు 46 వేల బస్తాల సరకు రాగా, అన్ని రకాలకు మంచి ధర లభించింది. ముఖ్యంగా 2043 రకం క్వింటాలుకు రూ.30,000( ఏసీ సరుకు క్వింటాల్ రూ.35,000) వరకు రికార్డు స్థాయి ధర పలికింది. మిరప 341 రకం గరిష్ఠంగా క్వింటాకు రూ.25,000, నెంబర్ 5 రకం రూ.22,000-23,000, బంగారం, బుల్లెట్ రకాలు రూ.21,000-22,000, తేజ రకం రూ.19,500-20,000 వరకు ధర పలికాయి.
News January 21, 2026
విస్కీలకు ర్యాంకులు! లిస్ట్‌లో ఇండియన్ బ్రాండ్!!

ప్రపంచంలో విస్కీలకు ర్యాంకింగ్స్ ఇచ్చే జిమ్ ముర్రే విస్కీ బైబిల్ 2025-26 రిలీజైంది. ఇందులో World Whiskey of the year టైటిల్ USAకు చెందిన ఫుల్ ప్రూఫ్ 1972 బౌర్బన్, టాప్ సింగిల్ మాల్ట్ స్కాచ్‌గా గ్లెన్ గ్రాంట్, రెడ్‌బ్రెస్ట్, భారత్‌కు చెందిన పాల్ జాన్ ఉన్నాయి. ఇక కర్ణాటకకు చెందిన అమృత్ డిస్టిలరీస్ Expedition (15Y. old Single Malt) మోస్ట్ ఫైనెస్ట్ విస్కీ ర్యాంక్3ని పొందింది. దీని ధర రూ.10 లక్షలు.
News January 21, 2026
పిల్లలు బరువు కాదు.. భవిష్యత్తు!

US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఉష దంపతులు నాలుగో <<18911938>>బిడ్డకు<<>> జన్మనివ్వనుండటం చర్చకు దారితీసింది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తమ దేశ ప్రజలకు ఇలా సందేశం ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లల్ని బరువుగా కాకుండా భవిష్యత్తుగా భావించాలని అక్కడి ప్రభుత్వాల సూచన. అయితే మన దేశంలోనూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాజకీయ నేతలు చెబుతున్నా ఆర్థిక స్తోమత లేదని మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. మీ COMMENT


