News May 12, 2024

నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల హైలైట్స్

image

AP, TGతో సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. *బరిలో ఉన్న అభ్యర్థులు 1,717 * మొత్తం ఓటర్లు 17.6 కోట్ల మంది * పోలింగ్ స్టేషన్లు 1.92 లక్షలు *పోలింగ్ సిబ్బంది 19 లక్షలకు పైనే..
* కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు మినహా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Similar News

News February 12, 2026

నేను ట్యాపింగ్ చేయడం లేదు: రేవంత్ రెడ్డి

image

తాను ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని TG సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. ‘ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుంది. కాల్స్ వినడం ఓ మానసిక రోగం. SIB పేరిట రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినిమా వాళ్లు, బిజినెస్‌మెన్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రభుత్వం మారగానే హార్డ్‌వేర్లు మాయం చేశారు. KCR విచారణతో ఈ కేసు క్లైమాక్స్‌కు చేరిందని అనుకోవడం లేదు’ అని తెలిపారు.

News February 12, 2026

సింగరేణి నిబంధనలు మార్చింది కేంద్రమే: CM

image

TG: సింగరేణి టెండర్ల నిబంధనల్లో 2018లోనే కేంద్రం మార్పులు చేసిందని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘సైట్ విజిట్‌ పర్మిషన్ తీసుకోవాలని అప్పుడే పెట్టారు. దీన్ని నిరూపిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా? సింగరేణే కాదు కోల్ ఇండియా కూడా నష్టాల్లో ఉంది. సింగరేణి సంస్థ జెన్‌కోకు కూడా బొగ్గు సరఫరా చేసింది. అమాయకుడిని కాబట్టి నాపై నిందలు వేస్తున్నారు. KCRను ఎందుకు అడగడం లేదు’ అని ప్రశ్నించారు.

News February 12, 2026

T20 WC: పాక్ మ్యాచుకూ అభిషేక్ దూరం?

image

టీమ్‌ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే నమీబియాతో మ్యాచుకు దూరమైన అభిషేక్ మరో మ్యాచుకూ దూరమవ్వొచ్చని టాస్ సమయంలో SKY చెప్పారు. దీంతో ఈ నెల 15న పాక్‌తో మ్యాచుకు అభిషేక్ అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆడకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.