News August 12, 2024

హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. రూ.53వేల కోట్ల సంపద ఆవిరి!

image

అదానీ, సెబీ చీఫ్ మాధబీపై హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదానీ స్టాక్స్ 7శాతానికి పైగా నష్టపోవడంతో రూ.53వేల కోట్ల సంపద ఆవిరైంది. BSEలోని అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర రూ.1656కు పడిపోయింది. అదానీ పవర్ 4%, విల్‌మర్, ఎనర్జీ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజెస్ 3% చొప్పున నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలోని అదానీ పోర్ట్స్ 2% డౌన్ ఫాల్ అయింది.

Similar News

News September 14, 2024

‘మత్తు వదలరా-2’ వచ్చేది ఈ ఓటీటీలోనే

image

నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మత్తు వదలరా-2’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాలకు ఈ మూవీ ఓటీటీలో రానుంది. ఇందులో శ్రీసింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా ప్రధాన పాత్రల్లో నటించగా, రితేశ్ రానా దర్శకత్వం వహించారు. తొలిరోజు ఈ మూవీ రూ.5.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

News September 14, 2024

ఓటీటీలోకి రాజ్ తరుణ్-మాల్వీ మూవీ

image

ఇటీవల చర్చనీయాంశంగా మారిన జోడీ రాజ్ తరుణ్-మాల్వీ కలిసి నటించిన చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ సినిమా ఆహా వేదికగా ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా లావణ్య అనే యువతితో ప్రేమ వ్యవహరం ఆరోపణలతో రాజ్ తరుణ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.

News September 14, 2024

ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష.. ఇంటర్నెట్ నిలిపివేత!

image

అస్సాంలో గ్రేడ్-3 ప్రభుత్వ ఉద్యోగాలకు రేపు ఉ.10 గంటల నుంచి మ.1:30 గంటల వరకు నియామక పరీక్ష జరగనుంది. దీంతో పరీక్ష జరిగే సమయంలో అన్ని ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ను ప్రభుత్వం నిలిపివేయనుంది. 28 జిల్లాల్లో 2,305 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మోసానికి పాల్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలోనూ పరీక్షల సమయంలో ప్రభుత్వం ఇలానే ఇంటర్నెట్ నిలిపివేసింది.