News February 26, 2025

హిందూపండగ సెలవు రద్దుచేసి రంజాన్‌కు కేటాయింపు

image

KMC ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంటు తీసుకున్న ఓ నిర్ణయం బెంగాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. విశ్వకర్మ పూజ సెలవు (SEP 17)ను రద్దు చేసి రంజాన్‌కు (APR 1) అదనంగా కేటాయించారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కోల్‌కతా మున్సిపల్ కమిషనర్ స్పందించారు. తమకు చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. KMCED మేనేజర్ సిద్ధార్థ శంకర్‌కు షోకాజ్ నోటీసు పంపారు. సెలవు నిర్ణయాన్ని రద్దు చేశారు.

Similar News

News March 27, 2025

ఆ సీన్ కోసం 1000 సార్లు చూస్తారు: RC16 నిర్మాత

image

రామ్ చరణ్ ‘RC16’పై అభిమానుల్లో అంచనాలు పెంచేలా నిర్మాత రవిశంకర్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గ్లింప్స్ చూశానని, ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన ఓ సన్నివేశం కోసమైనా ప్రేక్షకులు 1000 సార్లు చూస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.

News March 27, 2025

5 వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు

image

AP: ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 5 ప్రభుత్వ వైద్య శాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరయ్యాయి. వాటిలో రంగరాయ మెడికల్ కాలేజీ, రాయచోటి, చీరాల, పాలకొండ, భీమవరం ఏరియా ఆస్పత్రులున్నాయి. ఒక్కో యూనిట్‌కు రూ.23.75 కోట్ల చొప్పున మొత్తం రూ.118.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఆస్పత్రుల్లో 50 బెడ్స్‌తో ఐసీయూ విభాగాలు ఏర్పాటవుతాయి.

News March 27, 2025

విశాఖలో లులూ మాల్.. భూమి కేటాయింపు

image

AP: విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించబోయే షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను APIICకి బదలాయించాలని VMRDAకు ఆదేశాలు జారీ చేసింది. 2017లోనే లులూకు భూమి కేటాయించగా 2023లో గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ భూకేటాయింపులు చేయాలని APIICని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.

error: Content is protected !!