News December 17, 2024
ఆర్థిక మాంద్యంలోనూ ఆయన ఆస్తి తగ్గలేదు!
ముఖేశ్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్నట్లే బంగ్లాదేశ్‌లోనూ ఓ ధనికుడు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఆస్తి మాత్రం పెరుగుతూ వస్తోంది. ఆయనెవరో కాదు DATCO గ్రూప్ వ్యవస్థాపకుడు ముసా బిన్ షంషేర్. ఆయన నికర ఆదాయం $12 బిలియన్లు (రూ. 99,600 కోట్లు). ఈయన మాజీ ప్రధాని హసీనా కంటే 40వేల రెట్లు సంపన్నుడు. DATCO కంపెనీ ముఖ్యంగా ఆయుధాల వ్యాపారానికి ప్రసిద్ధి.
Similar News
News January 25, 2025
ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు?
TG: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుదిదశకు చేరింది. దీంతో రాష్ట్రంలో FEB నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీల పాలన గడువు ముగిసి వచ్చే నెల 1తో ఏడాది కావొస్తుండగా, మరోసారి ఇన్‌ఛార్జుల పాలన కొనసాగించేందుకు సర్కారు సిద్ధంగా లేదు. అటు రూరల్, అర్బన్ లోకల్ బాడీలకు వేర్వేరుగా కమిషన్ నివేదిక ఇవ్వనుంది.
News January 25, 2025
రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ రోజు రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లు రేపు మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చాలా పట్టణాల్లో ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి.
News January 25, 2025
విజయసాయి ఇంటికి వైసీపీ ఎంపీ
AP: ఎంపీ పదవికి రాజీనామా ప్రకటించిన విజయసాయి ఇంటికి తిరుపతి YCP ఎంపీ గురుమూర్తి వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో షాక్ అయ్యా. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా వచ్చా. జగన్ అన్నను మళ్లీ సీఎంగా చేసుకోవడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని కోరా. దానిపై ఆలోచిద్దాం అని చెప్పారు’ అని గురుమూర్తి వెల్లడించారు.