News January 4, 2025

HMPV.. డేంజర్ లేదన్నారంటే ప్రమాదమే: నెటిజన్ల మీమ్స్

image

చైనాలో విస్తరిస్తోన్న HMPV ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. అయితే దాంతో ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరోనా గురించి కూడా ఇలానే చెప్పారంటూ పోస్టులు చేస్తున్నారు. వాళ్ల ప్రకటన తర్వాత నిజంగా భయమేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. 2020, 2025 జనవరి క్యాలెండర్లు ఒకేలా ఉన్నాయంటున్నారు. అప్రమత్తంగా ఉండటమే మంచిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు?

Similar News

News January 19, 2025

తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది: షా

image

AP: విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు చర్చించి, కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టిందన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు. ‘హైందవ శంఖారావం’ విజయం పట్ల VHP, BJP నేతలను షా అభినందించారు.

News January 19, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్‌ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి.

News January 19, 2025

TGలో కాపిటా ల్యాండ్ ₹450 కోట్ల పెట్టుబడులు!

image

TG: సింగపూర్‌లో పర్యటిస్తున్న CM రేవంత్ బృందం మరో భారీ పెట్టుబడిని రాబట్టినట్లు CMO వెల్లడించింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్కు ఏర్పాటుకు ₹450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాపిటా ల్యాండ్ సంస్థ ముందుకొచ్చిందని పేర్కొంది. దీని వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. నిన్న STT గ్లోబల్ డేటా సెంటర్ ₹3,500 కోట్ల పెట్టుబడితో ఆర్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకుంది.