News September 27, 2024

క్రికెటర్ల కన్నా హాకీ ప్లేయర్లే ఫిట్టెస్ట్: హార్దిక్

image

క్రికెటర్లతో పోలిస్తే హాకీ ప్లేయర్లే ఎక్కువ ఫిట్‌గా ఉంటారని టీమ్ఇండియా స్టార్ మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘యోయో టెస్టులో 19 లేదా 20 స్కోర్ వస్తేనే క్రికెటర్లను ఫిట్టెస్ట్ అనేస్తారు. హాకీలో మా గోల్ కీపర్ శ్రీజేశ్ స్కోరే 21. మొత్తం 8 స్ప్రింట్స్ ఉండే ఈ టెస్టులో 23.8 హయెస్ట్ స్కోర్. మా టీమ్‌లో ఏడుగురు దీనిని సాధించారు. మా జూనియర్ గర్ల్స్ స్కోరే 17-18గా ఉంటుంది’ అని వివరించారు.

Similar News

News October 15, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?

image

దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్‌లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.

News October 15, 2024

కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు

image

కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.

News October 15, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

image

AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీమెన్స్ సంస్థకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. నకిలీ బిల్లులతో కొనుగోళ్లు జరిపినట్లు, వ్యక్తిగత ఖాతాలకు ఈ సంస్థ నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇదే కేసులో గతేడాది చంద్రబాబు జైలుకెళ్లారు.