News December 1, 2024
దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి: YCP MP

AP: ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఢిల్లీ వాతావరణం సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోందని వివరించారు. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో సమావేశాలు పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి.
Similar News
News February 11, 2025
సూపర్ హిట్ వెబ్‌సిరీస్ సీక్వెల్ రెడీ

ఐశ్వర్యా రాజేశ్, కథిర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సుడల్: ది వర్టిక్స్’ సీక్వెల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2022లో విడుదలై పార్ట్-1 సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పుష్కర్-గాయత్రి తెరకెక్కించిన ఈ సిరీస్ IMDb రేటింగ్ 8.1 సాధించడంతో పాటు 30 భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది.
News February 11, 2025
జేఈఈ రిజల్ట్స్: ఏపీ, టీజీ విద్యార్థులకు 100 పర్సంటైల్

జేఈఈ మెయిన్ తొలి సెషన్ <<15430043>>ఫలితాల్లో<<>> తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన గుత్తికొండ మనోజ్ఞ, తెలంగాణకు చెందిన బనిబ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు. ఏపీ విద్యార్థి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్‌కు 99.99 పర్సంటైల్ వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది 100 పర్సంటైల్ సాధించారు.
News February 11, 2025
ప్రముఖ క్రికెటర్ రిటైర్మెంట్

దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్ రిటైర్మెంట్ ప్రకటించారు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన ఇతను ఫస్ట్ క్లాస్+లిస్ట్ A+T20లలో పదివేలకు పైగా పరుగులు చేశారు. ఇందులో 31 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. IPLలో RCB, KKR జట్లు ఇతడిని కొనుగోలు చేసినప్పటికీ కేవలం 9 మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం వచ్చింది.