News March 26, 2024

హోలీ శుభాకాంక్షలు: బైడెన్ దంపతులు

image

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హోలీ జరుపుకొనేవారందరికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హోలీ వేడుకలను చేసుకుంటారు. వసంత రుతువు ఆగమనాన్ని వివిధ రంగులతో గుర్తుచేసుకుంటారు. వారందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Similar News

News January 19, 2026

హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు… అప్లై చేశారా?

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>>లో 4 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BE/BTech 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై, పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, షార్ట్ లిస్టింగ్, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.5వేలు జీతం పెంచుతారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in

News January 19, 2026

గొర్రె, మేక పిల్లల పెరుగుదలకు సూచనలు

image

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.

News January 19, 2026

మాఘ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యాలు

image

మాఘమాసం పుణ్యకార్యాలకు, దానధర్మాలకు పెట్టింది పేరు. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు పోతాయని పురాణాల వాక్కు. రోజూ మాఘపురాణ పఠనం, విష్ణుసహస్రనామాలు స్మరించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు.