News March 26, 2024
హోలీ శుభాకాంక్షలు: బైడెన్ దంపతులు

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హోలీ జరుపుకొనేవారందరికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హోలీ వేడుకలను చేసుకుంటారు. వసంత రుతువు ఆగమనాన్ని వివిధ రంగులతో గుర్తుచేసుకుంటారు. వారందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
Similar News
News December 11, 2025
మరింత పెరగనున్న రీఛార్జ్ ధరలు!

మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తోంది. Jio, Airtel, VI టారిఫ్‌లను 10 నుంచి 12% వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని టెలికం వర్గాలు చెబుతున్నాయి. తక్కువ ధరలలో ఉన్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను ఇప్పటికే కంపెనీలు తొలగించడం కూడా పెంపుపై అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పేమెంట్ యాప్‌లలోనూ “రీఛార్జ్ ధరలు పెరగొచ్చు” అంటూ అలర్ట్స్ రావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
News December 11, 2025
మహిళల ఆరోగ్యానికి ఎలాంటి విటమిన్లు కావాలంటే?

చాలామంది మహిళలు విటమిన్ల లోపంతో బాధపడుతున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మహిళల ఆరోగ్యంలో విటమిన్లు, ఖనిజాల సమతుల్య వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యం నుంచి హార్మోన్ల వరకు, విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ D3, విటమిన్ C, విటమిన్ B12, విటమిన్ B9, విటమిన్ B6తో సహా అవసరమైన విటమిన్ల సమతుల్య వినియోగం మహిళల హార్మోన్ల ఆరోగ్యానికి కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
News December 11, 2025
గుడికి ఎందుకు వెళ్లాలి?

ఆలయ ప్రాంగణంలో సానుకూల శక్తి ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉండే శక్తిమంతమైన తరంగాలు మనలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. గంట చప్పుడు, హారతి, పూల పరిమళం, చెప్పులు లేకుండా నడవడం, కుంకుమ ధరించడం.. ఈ ప్రక్రియలు మన పంచేంద్రియాలను జాగృతం చేస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. తీర్థంలోని తులసి, రాగి శారీరక సమస్యలను దూరం చేస్తాయి. ప్రశాంతత, ఆరోగ్యం కోసం ఆలయాలకు వెళ్లాలి. మరింత సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


