News April 11, 2025
రేపు సెలవు రద్దు

AP: రేపు (రెండో శనివారం) సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు రద్దు చేసింది. ఏప్రిల్ 12ను వర్కింగ్ డేగా ప్రకటిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ మెమో జారీ చేసింది. రేపు ఉ.11 గం. నుంచి సా.5.30 వరకు ఆఫీసులు పని చేయనున్నాయి. హాలిడే సమయాల్లో రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే రేపు మాత్రం రూ.5వేలు తీసుకోకుండానే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది.
Similar News
News April 19, 2025
ఘోరం: విద్యుత్ షాకిచ్చి.. గోళ్లు పీకి..

ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాలోని ఓ ఐస్‌క్రీమ్ పరిశ్రమ యజమానులు ఇద్దరు కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దొంగతనం చేశారన్న అనుమానంతో వారిద్దరి దుస్తులు ఊడదీసి కరెంట్ షాకిచ్చారు. అనంతరం గోళ్లు పెకలించి హింసించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News April 19, 2025
IPL చరిత్రలో అతిపిన్న వయస్కుడు అరంగేట్రం

RRతో మ్యాచులో LSG కెప్టెన్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. RRకు శాంసన్ దూరం కాగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నారు. అతిపిన్న వయసులో IPL ఆడుతున్న ప్లేయర్‌గా అతడు చరిత్ర సృష్టించారు.
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, మిల్లర్, సమద్, ఆవేశ్, బిష్ణోయ్, దిగ్వేశ్, శార్దూల్, ప్రిన్స్
RR: జైస్వాల్, దూబే, రాణా, పరాగ్, జురెల్, హెట్మైర్, హసరంగా, ఆర్చర్, తీక్షణ, సందీప్, దేశ్‌పాండే
News April 19, 2025
మరోసారి థియేటర్లలోకి ‘బాషా’

రజినీకాంత్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటైనా ‘బాషా’ మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 25న రీరిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రజిని స్వాగ్, స్టైల్‌ను థియేటర్లలో చూసేందుకు సిద్ధమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న చాలా చిత్రాలకు ‘బాషా’ స్క్రీన్ ప్లేను రిఫరెన్స్‌గా వాడతారని సినీ విశ్లేషకులు చెబుతారు.