News December 7, 2024

సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

image

AP: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం 23 సాధారణ, 19 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. 23 సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం రావడంతో 19 సెలవులు మాత్రమే ఉద్యోగులకు లభించనున్నాయి. ఆప్షనల్ హాలిడేస్‌లో ఈద్-ఎ-గదిర్, మహాలయ అమావాస్య ఆదివారం వచ్చాయి. మొత్తం 12 నెలల్లో మే, నవంబర్ తప్ప 10 నెలల్లో సెలవులు ఉన్నాయి.

Similar News

News January 17, 2025

సీఎం చంద్రబాబు సీరియస్

image

AP: తనతో సమావేశానికి కొందరు ఎంపీలు హాజరుకాకపోవడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమైన భేటీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. వచ్చే సమావేశానికి ఇది రిపీట్ కాకూడదని చెప్పారు. జిల్లా అభివృద్ధి బాధ్యత MP, ఇన్‌ఛార్జ్ మంత్రి, కలెక్టర్, జిల్లా మంత్రిదేనని స్పష్టం చేశారు. కొందరు MLAలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఎంపీ, ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని సీఎం తేల్చి చెప్పారు.

News January 17, 2025

‘సంచార్ సాథీ’ యాప్ ప్రారంభం.. ఉపయోగాలివే

image

స్కామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు వీలుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ‘సంచార్ సాథీ’ యాప్‌ను ఆవిష్కరించారు. మీకు ఏవైనా అనుమానిత కాల్స్‌ వస్తే ఈ యాప్‌లో లాగినై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. మొబైల్ పోయినప్పుడు వెంటనే బ్లాక్ చేసే వీలుంది. మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకుని, అనధికార నంబర్లపై ఫిర్యాదు చేసే వీలుంది. IMEI నంబర్ ఎంటర్ చేసి మొబైల్ ప్రామాణికతను కూడా గుర్తించొచ్చు.

News January 17, 2025

మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు

image

HYD మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు దక్కింది. వీటిని న్యూయార్క్‌కు చెందిన వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్ ‘వరల్డ్ మోనుమెంట్స్ వాచ్-2025’ జాబితాలో చేర్చింది. హైకోర్టు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కాలేజ్, ఉమెన్స్ యూనివర్సిటీ వీటిలో ఉన్నాయి. కాగా కళ కోల్పోయిన ఈ చారిత్రక భవనాలకు సీఎం రేవంత్ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో పునర్వైభవం రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.