News April 10, 2025

భారీగా తగ్గనున్న హోమ్ లోన్ EMI

image

ఆర్బీఐ రెపో రేటును 6 శాతానికి తగ్గించడంతో లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా గృహ రుణదారులకు నెలవారీ EMIలు భారీగా తగ్గనున్నాయి. ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధితో రూ.30 లక్షల లోన్ ఉంటే నెలవారీ EMI రూ.26,247 నుంచి రూ.25,071కి తగ్గనుంది. ప్రతినెలా రూ.1,176, 20 ఏళ్లకు రూ.2.82 లక్షలు ఆదా కానుంది. రూ.50 లక్షలు, రూ.70 లక్షలు, రూ.కోటి. రూ.1.5 కోట్లకు ఎంత మిగులుతుందో పైన ఫొటోలో చూడొచ్చు.

Similar News

News April 16, 2026

మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

image

మహిళలకు వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్‌. వీటితోపాటు యూట్రస్‌ క్యాన్సర్‌, అండాశయ (ఓవేరియన్‌) క్యాన్సర్‌ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌, ఓవేరియన్‌ క్యాన్సర్‌ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News April 16, 2026

దక్షిణాదికి అన్యాయం జరగదు: మోదీ

image

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని.. తమకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలనే భేదం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. రాజకీయాల్లో తమ శక్తి చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.

News April 16, 2026

YouTube షార్ట్స్‌కు బానిస అయ్యారా? ఇలా చేస్తే కనిపించవు..

image

కొంత మంది గంటల తరబడి యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తారు. అలాంటి వారి కోసం స్క్రీన్ టైమ్ తగ్గించేలా యూట్యూబ్ డిజేబుల్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని కోసం యూట్యూబ్ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి టైమ్ మేనేజ్‌మెంట్ సెలక్ట్ చేసుకోవాలి. కింది భాగంలో ‘Shorts feed limit’ ఆన్ చేసి జీరో మినట్స్ ఎంచుకోవాలి. దీంతో మీకు ఇక షార్ట్స్ కనిపించవు. తిరిగి చూడాలి అనుకుంటే Shorts feed limit ఆఫ్ చేస్తే చాలు.