News November 7, 2024
హోంమంత్రి అనిత వార్నింగ్
AP: భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఘటనలోనైనా 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంలో పోలీసులు తలెత్తుకునేలా, నేరస్థుడు భయపడేలా చేస్తామని చెప్పారు.
Similar News
News December 12, 2024
సినీ నటుడు మోహన్ బాబుపై మరో ఫిర్యాదు
మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మంచు విష్ణు నటిస్తున్న ఓ మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారు. మోహన్ బాబుతోపాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News December 12, 2024
‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న సర్కార్
AP: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. మొత్తం 17.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకుంది. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో సరస్వతి కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది.
News December 12, 2024
నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ
TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సురేఖ తరఫున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరుకావడానికి మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి కోర్టు వాయిదా వేసింది.