News November 6, 2024
అంబటికి హోంమంత్రి అనిత కౌంటర్
AP: తాను మైక్ ముందు మాట్లాడే హోంమంత్రినే కాదని, స్త్రీ జాతిని అగౌరవపరుస్తూ మాట్లాడే వారిని లాఠీతో మక్కెలిరగ్గొట్టించే హోంమంత్రినని <<14528470>>అంబటి రాంబాబుకి<<>> అనిత కౌంటర్ ఇచ్చారు. వావివరుసలు మరిచి ఆంబోతుల్లా సోషల్ మీడియాలో విరుచుకుపడే విపరీతాలని గట్టిగా ఎదిరించే విపత్తు నిర్వహణ శాఖ మంత్రినని పేర్కొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఉన్మాదంగా ప్రవర్తించే వారిని చట్టప్రకారం శిక్షించే హోంమంత్రినని బదులిచ్చారు.
Similar News
News December 7, 2024
కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి.. మీ కామెంట్
TG:కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తైంది. మహిళలకు ఫ్రీ బస్సు, ₹2లక్షల రుణమాఫీ, ₹500కే గ్యాస్ సిలిండర్, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి ₹10లక్షలకు పెంపు, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఉద్యోగాల భర్తీ సహా మరిన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్ల పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా అమలవకపోవడం సహా పలు అంశాల్లో ప్రజలకు అసంతృప్తి నెలకొంది. మీ కామెంట్?
News December 7, 2024
పుష్కలంగా టీబీ మందులు: కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో క్షయ వ్యాధి(TB) నిరోధక ఔషధాల కొరత ఏర్పడిందన్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. DEC6 నాటికి అన్ని కేంద్రాల్లో 2 నెలలకు పైగా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపింది. మందులను సకాలంలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామంది. కాగా TB కేసుల్లో దేశం టాప్‌లో ఉంది. 21.69లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. TB కట్టడే లక్ష్యంగా 347 హైఫోకస్ జిల్లాల్లో 100 రోజుల ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
News December 7, 2024
ఆటోల బంద్‌పై వెనక్కి తగ్గిన JAC
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆటోల బంద్‌కు పిలుపునిచ్చిన JAC దానిని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ గిరాకీ పోయి, ఉపాధి దెబ్బతిందని JAC నేతలు తొలుత ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చారు. తమకు ప్రభుత్వం ఏటా రూ.15వేలు చెల్లించాలని కోరుతున్నారు.