News August 9, 2024

కవితకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం: KTR

image

TG: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ CM కేజ్రీవాల్‌తో పాటు తన సోదరి, MLC కవితకు త్వరలోనే బెయిల్ వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ CM సిసోడియాకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయినా ఛార్జిషీట్ దాఖలు చేశాక జైల్లో ఉంచాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. జైల్లో ఉన్న కవిత 11KGల బరువు తగ్గారని ఆయన అన్నారు.

Similar News

News March 16, 2026

గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు

image

LPGకి హైడిమాండ్ నెలకొన్న వేళ PNG కనెక్షన్లకు ప్రజలను ఆకర్షించేందుకు గ్యాస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. MAR 31లోగా రిజిస్టరయ్యే డొమెస్టిక్ యూజర్లకు GAIL, ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థలు ₹500 విలువైన ఫ్రీ గ్యాస్ అందించనున్నాయి. మహానగర్ గ్యాస్.. కమర్షియల్‌ కనెక్షన్ల సెక్యూరిటీ డిపాజిట్ (₹1L-5L), డొమెస్టిక్‌‌ రిజిస్ట్రేషన్ ఫీ (₹500)పై మినహాయింపు ఇచ్చింది. BPCL కూడా కమర్షియల్‌పై జీరో డిపాజిట్ ప్రకటించింది.

News March 16, 2026

జూన్ నెల శ్రీవారి దర్శన కోటా టికెట్ల వివరాలు

image

☛ ఈ నెల 18 నుంచి 20 వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
☛ 21న శ్రీవారి ఆర్జిత సేవా, వర్చువల్ ఆర్జిత సేవా టోకెన్ల విడుదల
☛ 23న 10AMకి అంగప్రదక్షిణం ఫ్రీ టికెట్స్, 11AMకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఆన్‌లైన్ కోటా, 3PMకి సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోటా
☛ 24న 10AMకి స్పెషల్ ఎంట్రీ (₹300) దర్శనం టికెట్లు, 3 PM నుంచి గదుల కోటా

News March 16, 2026

రూ.3లక్షల కోట్లకు పైగా బడ్జెట్… చర్చ 6 రోజులే!

image

TG: అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ కుదించుకుపోతోంది. FY25-26లో ₹3.04L కోట్ల బడ్జెట్ పెట్టగా సభ 11 రోజులు జరిగింది. GOVR ప్రసంగం, ధన్యవాదాలు, బడ్జెట్ ప్రవేశానికి 4రోజులు పోను బడ్జెట్‌పై చర్చ 7రోజుల్లో ముగిసింది. ఈసారి బడ్జెట్ గతం కన్నా పెరిగే అవకాశముంది. ప్రస్తుత సమావేశాలు ఈనెల 30వరకు ఉంటాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, ఆదివారాలు పోను మొత్తం పనిదినాలు 10 రోజులే. అందులో బడ్జెట్‌పై చర్చించేది 6 రోజులే.