News August 9, 2024

ఘోరం.. శిశువు మృతదేహం పీక్కుతిన్న కుక్కలు

image

TG: వీధి కుక్కలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా వరంగల్ MGM ఆస్పత్రి వద్ద 2 రోజుల శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమి శిశువు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్ద శిశువును ఎవరు పడేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 18, 2025

దొంగతనం చేయలేదు: కరీనా కపూర్

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు నమోదు చేశారు. దుండగుడు సైఫ్‌ను చాలా సార్లు పొడిచాడని ఆమె తెలిపారు. తమ కుమారుడు జహంగీర్ వద్దకు వెళ్లేందుకు పదే పదే ప్రయత్నించాడని, సైఫ్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. కానీ ఇంట్లో ఎలాంటి డబ్బులు, ఆభరణాలు దొంగతనం చేయలేదని పోలీసులకు వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News January 18, 2025

డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

image

AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమిపూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది. సగం నిర్మాణం పూర్తి కాగానే దానిపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించనున్నారు.

News January 18, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ

image

బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ కలెక్షన్ల రాబడుతోంది. ఈ నెల 14న మూవీ విడుదల కాగా 4 రోజుల్లో రూ.131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇవాళ, రేపు వీకెండ్స్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.