News January 18, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ

బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ కలెక్షన్ల రాబడుతోంది. ఈ నెల 14న మూవీ విడుదల కాగా 4 రోజుల్లో రూ.131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇవాళ, రేపు వీకెండ్స్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News February 16, 2025
‘సచివాలయ’ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై రేపు కీలక భేటీ

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేయగా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో రేపు ఆయా సంఘాల నేతలతో మంత్రి డోలా వీరాంజనేయస్వామి భేటీ కానున్నారు. <<15268707>>క్రమబద్ధీకరణ<<>> తర్వాత మిగిలిపోయే 40వేల మందిని ఏ శాఖల్లోకి కేటాయించాలి? అనే అంశంపై వారి సూచనలు తీసుకోనున్నారు.
News February 16, 2025
ప్రముఖ నటి కన్నుమూత

ప్రముఖ సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24) ఇవాళ కన్నుమూశారు. సియోల్‌లోని తన ఇంట్లో ఆమె శవమై కనిపించారు. పోస్టుమార్టం తర్వాత నటి మరణానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఆమె 2009లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ది బ్రాండ్ న్యూ లైఫ్, ది నైబర్స్, సీక్రెట్ హీలర్, ది విలేజర్స్, బ్లడ్ హౌండ్స్ తదితర చిత్రాలు, టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించారు.
News February 16, 2025
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్

మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ PM ప్రవింద్ జగన్నాథ్(63)ను ఆ దేశ ఆర్థిక నేరాల కమిషన్ అరెస్ట్ చేసింది. ఆయన నివాసంలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, లగ్జరీ వాచ్‌లు, నగదును స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ 2017-24 మధ్య PMగా పనిచేశారు. ఆయన చేసుకున్న కొన్ని ఒప్పందాల్లో స్కామ్స్ జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని కొత్త ప్రధాని నవీన్ రామ్ అప్పట్లో ప్రకటించారు. అన్నట్లుగానే చర్యలు తీసుకున్నారు.