News November 29, 2024
ఘోరం: కదులుతున్న అంబులెన్స్లో బాలికపై గ్యాంగ్ రేప్

మధ్యప్రదేశ్లోని మౌగాంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలిక(16)ను కిడ్నాప్ చేసి కదులుతున్న ప్రభుత్వ అంబులెన్స్లో ఇద్దరు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. ఈ నెల 25న ఈ ఘటన జరగగా బాలిక ఫిర్యాదుతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. నిందితులైన అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, అతని స్నేహితుడు రాజేశ్ కేతవ్లను పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News November 25, 2025
టెంపుల్ కారిడార్ నిర్మాణానికి రూ.380 కోట్లు: TPCC ఛీఫ్

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, లింబాద్రిగుట్ట, బాసరను కలుపుతూ టెంపుల్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.380 కోట్లు మంజూరు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్మపురిలో ప్రారంభమై కొండగట్టు, వేములవాడ, భీమ్గల్ మీదుగా బాసర వరకు ఈ కారిడార్ నిర్మిస్తారని ఆయన ప్రకటించారు.
News November 25, 2025
జుబీన్ గార్గ్ను హత్య చేశారు: సీఎం హిమంత

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం CM హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురయ్యారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 52 ఏళ్ల జుబీన్ ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తొలి నుంచీ ఆయన కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. ఈక్రమంలోనే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News November 25, 2025
బలవంతపు వాంతులతో క్యాన్సర్: వైద్యులు

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.


