News August 2, 2024

ఘోరం: వృద్ధురాలిని చంపి తిన్న వీధి కుక్కలు

image

TG: వీధి కుక్కల దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వానితాళ్ల గ్రామంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని వీధికుక్కలు చంపి పలు భాగాలను తినేశాయి. పక్క ఇంట్లోనే ఉంటున్న కుమారులు వచ్చి చూసేసరికి ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. ఊళ్లో కుక్కల నోళ్లకు రక్తం ఉండటాన్ని వారు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News October 6, 2024

జానీ మాస్టర్‌ అవార్డును ఆపడం మూర్ఖత్వమే: నటుడు

image

పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జానీ మాస్టర్‌కు దక్కిన నేషనల్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ నిర్ణయాన్ని నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఖండించారు. ‘కేసు రుజువయ్యేవరకు జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా. తన కొరియోగ్రఫీ టాలెంట్‌కు, తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి? ఇది మూర్ఖత్వమే. సారీ’ అని ట్వీట్ చేశారు.

News October 6, 2024

అది ఐపీఎల్ టోర్నీలోనే అతిపెద్ద మూవ్ అవుతుంది: ఏబీడీ

image

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ఆర్సీబీలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అతి పెద్ద మూవ్ కానుందని అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్ ముంబైని వీడే అవకాశం 0.1శాతమేనని పేర్కొన్నారు. అది కూడా జరిగే అవకాశం లేదన్నారు. మరోవైపు గత సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే.

News October 6, 2024

18 ఏళ్లపాటు రూ.49 వేల కోట్లు అక్రమంగా వసూలు!

image

అధిక రాబ‌డులు ఆశ‌చూపి రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న ఆరోపణలపై పెర‌ల్ ఆగ్రో కార్పొరేష‌న్ లిమిటెడ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. 18 ఏళ్ల‌పాటు దేశవ్యాప్తంగా 5.8 కోట్ల‌ మంది నుంచి సదరు సంస్థ ఏకంగా రూ.49 వేల కోట్లు వ‌సూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 44 చోట్ల సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.