News November 24, 2024

ఎంత ఘోరం.. 5ఏళ్ల కూతురిని చంపిన తల్లి.. కారణమిదే!

image

ఢిల్లీలోని అశోక్‌విహార్‌లో అమానవీయ ఘటన జరిగింది. HPకి చెందిన ఓ మహిళను భర్త విడిచి పెట్టగా ఢిల్లీకి చెందిన మరో వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రేమలో పడింది. ప్రియుడి కోసం ఢిల్లీ వెళ్లగా అసలు కథ మొదలైంది. ఆ మహిళకు అత్యాచార బాధితురాలైన కూతురు(5) ఉంది. కాగా ఆ చిన్నారితో కలిసి ఉండటం కుదరదని సదరు ప్రియుడు ఆమెను తిరస్కరించాడు. ఈక్రమంలోనే ప్రియుడి కోసం కూతుర్ని మహిళ హతమార్చింది. కేసు నమోదైంది.

Similar News

News December 11, 2024

మా నాన్న దేవుడు: మనోజ్

image

TG: కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేశానని మంచు మనోజ్ తెలిపారు. ‘మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్.. నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా? అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను, నా భార్య ఎవరి పనివారు చేసుకుంటున్నాం.’ అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.

News December 11, 2024

జర్నలిస్టుల ధర్నాకు మంచు మనోజ్ మద్దతు

image

సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. ‘మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

News December 11, 2024

విశ్వక్, అనుదీప్ కొత్త మూవీ ‘ఫంకీ’

image

విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్‌లో ‘ఫంకీ’ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. నాగవంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తారు. కాగా విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.