News January 10, 2025
స్పెలింగ్ ఎలా మర్చిపోతారు బ్రో!
లగ్జరీ బ్రాండ్స్ ప్రొడక్ట్స్‌ను కాపీ చేస్తూ పేరులో స్పెలింగ్ మార్చి అమ్మేస్తుంటారు. అయితే, ఒరిజినల్ ప్రొడక్ట్ షాపు పేరులోనే స్పెలింగ్ తప్పుగా ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ PUMA షోరూమ్ పేరును PVMAగా ఏర్పాటుచేయడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది వినేందుకు హాస్యాస్పదంగా ఉన్నా.. సంస్థకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఫేక్ బ్రాండ్ అనుకొని కస్టమర్లు అటువైపు వెళ్లేందుకే ఇష్టపడలేదు.
Similar News
News January 19, 2025
మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు
TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
News January 19, 2025
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
TG: వర్షాకాలం వరిధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.12,022 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ సారి సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే.
News January 19, 2025
సైఫ్‌పై దాడిని అంగీకరించిన నిందితుడు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది తానేనని <<15192921>>థానేలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి<<>> అంగీకరించాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడిని రెస్టారెంట్లో పనిచేసే మహమ్మద్ అలియాన్ అలియాస్ విజయ్ దాస్‌గా గుర్తించారు. చత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి నిందితుడు కాదని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి వివరాలను ఉ.9గంటలకు డీజీపీ ఆఫీసులో మీడియాకు వెల్లడిస్తామన్నారు.