News August 22, 2025
చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందంటే?

1988లో వచ్చిన మరణమృదంగం సినిమా ముందు వరకూ చిరంజీవిని సుప్రీం హీరో అని పిలిచేవారు. ఈ సినిమా తర్వాత చిరంజీవికి నిర్మాత కేఎస్ రామారావు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి టైటిల్ కార్డ్స్‌లో చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పడుతోంది. ఆ తర్వాత నాగబాబును మెగా బ్రదర్, రామ్ చరణ్‌ను మెగా పవర్ స్టార్, వరుణ్ తేజ్‌ను మెగా ప్రిన్స్, నిహారికను మెగా డాటర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు.
Similar News
News August 22, 2025
ప్రకాశ్ రాజ్ ట్వీట్ చంద్రబాబు, పవన్ గురించేనా?

క్రిమినల్ కేసుల్లో అరెస్టయి 30రోజులు జైల్లో ఉంటే PM, CMల పదవి పోయేలా కేంద్రం <<17465755>>కొత్త బిల్లును<<>> తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తనకో చిలిపి సందేహం కలిగిందని నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ‘మాజీ సీఎం కానీ ప్రస్తుత CM కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని” CM చేసే కుట్ర ఏమైనా ఉందా?’ అని ప్రశ్నించారు. ఆయన ఈ ట్వీట్‌ను తెలుగులో చేయడంతో ఇది AP గురించేనని చర్చ మొదలైంది.
News August 22, 2025
గోడ దూకి పార్లమెంటు భవనంలోకి..

ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో సెక్యూరిటీ వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గోడ దూకి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. ఈ ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News August 22, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.220 తగ్గి రూ.1,00,530కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.150 పతనమై రూ.92,150 పలుకుతోంది. అటు KG వెండి ధరపై రూ.2,000 పెరిగి రూ.1,28,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.