News October 5, 2024
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందంటే?
TG: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనుంది. రేషన్ షాప్‌కు వెళ్లి ఈ కార్డులోని QR కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ స్కీములు, RTC బస్సుల్లో పదే పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చు.
Similar News
News November 2, 2024
విజయనగరం ‘స్థానిక’ ఎమ్మెల్సీ స్థానానికి 4న నోటిఫికేషన్
AP: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా MLC నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ నెల 4న EC నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 11 వరకు నామినేషన్లు స్వీకరణ, 12న పరిశీలన ఉంటుంది. నవంబర్ 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇందుకూరి రఘురాజు టీడీపీలో చేరడంతో మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో బై ఎలక్షన్ అనివార్యమైంది.
News November 2, 2024
గవర్నర్ ప్రతిభా అవార్డులు.. నేటి నుంచి దరఖాస్తులు
TG: ఏటా 4 రంగాల ప్రముఖులకు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ నిర్ణయించారు. పర్యావరణం, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డులు ఇస్తారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు https://governor.telangana.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. అవార్డు కింద ₹2L, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
News November 2, 2024
సుమతీ నీతి పద్యం: విచక్షణ కలిగినవారు ఎవరు?
వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత సత్యమేదో, అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు అని భావం.