News July 11, 2024
ఈ పోలీసు ఎంత గొప్పోడో..!

పుష్ప చిన్నతనంలోనే అనాథ అయింది. ఆమెకు అన్నీ తానై నిలిచాడా పోలీసాయన. పెళ్ళి చేసి పల్లకీ మోసి దగ్గరుండి అత్తారింటికి పంపించారు. ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌లో ఈ హృద్యమైన ఘటన జరిగింది. ఆ ఇన్‌స్పెక్టర్ పేరు నరేశ్ చంద్ర. ఉన్నతాధికారుల అనుమతితో పుష్పను దత్తత తీసుకుని పెంచిన నరేశ్, ఇప్పుడు సొంత బిడ్డ పెళ్లి చేసినట్లుగా మురిసిపోయారు. లాఠీలకు కాఠిన్యమే కాక లాలిత్యమూ ఉంటుందని ప్రూవ్ చేశారు.
Similar News
News July 11, 2025
భారత్‌పై 11వ సెంచరీ బాదిన రూట్

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ENG స్టార్ బ్యాటర్ రూట్ సెంచరీతో చెలరేగారు. రెండో రోజు తొలి బంతికే ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశారు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా స్మిత్ సరసన చేరారు. 60 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేశారు. మొత్తంగా 37 సెంచరీలు చేసి ద్రవిడ్, స్మిత్(36)ను అధిగమించి టాప్ 5లో నిలిచారు. మరోవైపు బుమ్రా బౌలింగ్‌లో స్టోక్స్(44) ఔటయ్యారు. ప్రస్తుతం ENG స్కోర్ 265/5.
News July 11, 2025
యాపిల్ ఉద్యోగికి ₹1,714 కోట్లు చెల్లించిన మెటా!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అగ్రగామిగా నిలిచేందుకు మెటా CEO మార్క్ ఉద్యోగులకు కోట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా యాపిల్ కంపెనీలోని అగ్రశ్రేణి AI నిపుణుడైన రూమింగ్ పాంగ్‌ను మెటా నియమించుకుంది. తమ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ గ్రూపులో పాంగ్‌ను చేర్చినట్లు తెలిపింది. దీనికోసం ఆయనకు మెటా ఏడాదికి $200M( ₹1,714కోట్లు) చెల్లించనుండడం టెక్ యుగంలో చర్చనీయాంశమైంది. ఈ ప్యాకేజీ ఇచ్చేందుకు యాపిల్ ఇష్టపడలేదు.
News July 11, 2025
2 దేశాలకు ఆడిన అరుదైన క్రికెటర్ రిటైర్

రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన పీటర్ మూర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై పలికారు. 35 ఏళ్ల మూర్ 2014 నుంచి 2019 వరకు జింబాబ్వే తరఫున ఆడారు. ఆ దేశం తరఫున 49 వన్డేలు, 21 టీ20లు, 8 టెస్టులు ఆడి 1,700కుపైగా పరుగులు చేశారు. ఆ తర్వాత ఐర్లాండ్‌కు వలస వెళ్లి 7 టెస్టులు ఆడారు. ఐర్లాండ్ తరఫున వన్డే వరల్డ్ కప్ ఆడాలన్న తన కోరిక నెరవేరకుండానే వీడ్కోలు పలికారు. తన చివరి మ్యాచ్ జింబాబ్వేపైనే ఆడడం విశేషం.