News September 9, 2024

గర్భిణులకు డైట్ ఎంత కీలకమంటే..

image

ఆహారం విషయంలో గర్భిణులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని చెబుతున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల-బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.

Similar News

News October 17, 2025

రైల్వేలో 8,850 పోస్టులు.. 4 రోజుల్లో దరఖాస్తులు

image

రైల్వేలో మరో భారీ నియామకానికి రంగం సిద్ధమైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో గ్రాడ్యుయేట్ స్థాయిలో 5,800, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,050 పోస్టులున్నాయి.(పోస్టుల సంఖ్యలో మార్పులు ఉండొచ్చు). ఇంటర్, డిగ్రీ పాసైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఈనెల 21 నుంచి NOV 20వరకు, UG పోస్టులకు ఈనెల 28 నుంచి NOV 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/

News October 17, 2025

తల్లిపాలు పెంచే ఫుడ్స్ ఇవే..

image

మొదటిసారి తల్లైన తర్వాత మహిళలకు ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. వాటిల్లో ఒకటే తగినంత పాలు ఉత్పత్తికాకపోవడం. ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, ఓట్స్, నువ్వులు, మెంతులు తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.

News October 17, 2025

దమ్ముంటే కల్తీ మద్యంపై అఖిలపక్ష కమిటీ వేయండి: పేర్ని నాని

image

AP: తమ హయాంలోని QR కోడ్ పద్ధతిని కూటమి తొలగించి కల్తీ మద్యంతో భారీ ఎత్తున దోచుకుందని YCP నేత పేర్ని నాని దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వ బార్ పాలసీ వెనుక స్కామ్ ఉంది. నకిలీ మద్యం అమ్మకం కోసమే రూ.99 లిక్కర్‌ ఆపేశారు. రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం తెచ్చి అమ్మారు’ అని ఆరోపించారు. దీన్ని నిరూపించడానికి తాను సిద్ధమని, దమ్ముంటే అన్ని పార్టీల నేతలతో నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.