News September 9, 2024

గర్భిణులకు డైట్ ఎంత కీలకమంటే..

image

ఆహారం విషయంలో గర్భిణులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని చెబుతున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల-బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.

Similar News

News October 9, 2024

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయండి

image

రోజంతా చురుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉత్సాహంగా ఉండాలంటే మానసిక, శారీర ఆరోగ్యం బాగుండాలి. అందుకోసం ప్రతిరోజు కాసేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. సమయానికి నిద్రపోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

News October 9, 2024

ఆ విద్యార్థులకు పాత సిలబస్‌తో పబ్లిక్ ఎగ్జామ్స్

image

AP: పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో చదివి ఫెయిల్ అయిన ప్రైవేట్, రీ ఎన్‌రోల్ విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు SSC పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారికి కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయన్నారు. క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు.

News October 9, 2024

FLASH: న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్

image

ఇండియాతో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముంగిట న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 16న బెంగళూరులో మొదలయ్యే టెస్టుకు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండట్లేదని ఆ జట్టు సెలక్టర్లు ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అతడు అసౌకర్యానికి గురయ్యారు. కేన్ లేకపోవడం న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగానికి పెద్దలోటే.