News December 10, 2024

2025 ఎలా ఉండబోతోంది.. వందల ఏళ్ల కిందటే చెప్పిన నోస్ట్రాడమస్!

image

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో 2025 ఎలా ఉండబోతుందో ఫ్రెంచ్ జ్యోతిషుడైన నోస్ట్రాడమస్ విశ్లేషించిన విషయాలు వైరలవుతున్నాయి. వచ్చే ఏడాది భూమిని పెద్ద గ్రహశకలం ఢీకొట్టవచ్చని, లేదా దగ్గరగా రావచ్చని అంచనా వేశారు. ‘దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తుంది. బ్రెజిల్‌లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవ్వడం వంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది’ అని జోస్యం చెప్పారు.

Similar News

News January 18, 2025

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసులో తీర్పు వెల్లడి

image

యావత్ దేశం చలించిన <<13905124>>అభయ<<>> హత్యాచార కేసులో సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్‌ను దోషిగా తేలుస్తూ తీర్పిచ్చింది. కలకత్తా RG కర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్ 2024 AUG 9న దారుణ అత్యాచారం, హత్యకు గురైంది. నిర్భయ తీవ్రతను తలపించేలా జరిగిన ఈ దుశ్చర్యపై CBI దర్యాప్తు జరిపి OCT 7న ఛార్జిషీట్ వేసింది. డైలీ విచారణ అనంతరం నేడు దోషిగా తేల్చిన జడ్జి అనిర్బన్ దాస్ సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు.

News January 18, 2025

మరోసారి జత కట్టనున్న ధనుష్‌-వెంకీ అట్లూరి!

image

‘లక్కీ భాస్కర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్టును తమిళ నటుడు ధనుష్‌తో తీయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రెండోసారి ధనుష్‌తో జత కట్టనున్నారని, దీనికి ‘హానెస్ట్ రాజా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘సార్’ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

News January 18, 2025

మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్

image

TG: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. కాగా మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటుండగా, మంచు మనోజ్ జల్‌పల్లిలోని ఇంట్లో ఉంటున్నారు.