News August 20, 2024
వర్షపాతాన్ని ఎలా లెక్కిస్తారంటే?

వర్షపాతం mm, cmలలో నమోదైందని చెబుతుంటారు. అయితే ఎంత కురిసిందని కచ్చితంగా లెక్కించేందుకు ప్రత్యేక పరికరాలు ఉంటాయి. వీటిని ఆరుబయట ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. అవి మిల్లీమీటర్లు, సెంటీమీటర్ల కొలతలతో ఉంటాయి. వర్షం కురిసినప్పుడు అందులో చేరే నీటి స్థాయిని బట్టి ఎంత కురిసిందనేది చెప్తారు. మాములుగా చ.మీటర్ స్థలంలో లీటర్ నీరు నిలిస్తే 1mm వాన కింద లెక్క. కురిసిన సమయాన్ని బట్టి తీవ్రతను గుర్తిస్తారు.
Similar News
News July 5, 2025
వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం

AP: 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లి జలాశయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 419 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో అవి మరింత పెరుగుతాయన్నారు.
News July 5, 2025
ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)
News July 5, 2025
భారత్ డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 427/6 వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ డిక్లేర్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 607 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (161), రాహుల్ (55), పంత్ (65) జడేజా (69*) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరికాసేపట్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.