News May 14, 2024

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,815 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు సమకూరింది.

Similar News

News January 13, 2025

భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. క్యుషు ప్రాంతంలో భూప్రకంపనలు రాగా రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నేపాల్, టిబెట్ సరిహద్దులో సంభవించిన భూకంపం ధాటికి సుమారు 200 మంది మరణించిన విషయం తెలిసిందే.

News January 13, 2025

అప్పుడు జైలుకెళ్లిన వారికి రూ.20 వేల పెన్షన్

image

1975 నుంచి 1977 మ‌ధ్య దేశంలో ఎమర్జెన్సీ అమ‌లులో ఉన్న సమయంలో జైలుకెళ్లిన వారికి నెలవారీ రూ.20,000 పెన్షన్ మంజూరు చేస్తామ‌ని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్‌తో పాటు వారి వైద్య ఖర్చులనూ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, జనవరి 1, 2025 నాటికి జీవించి ఉన్న వారందరికీ ఈ సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలిపింది. జైలులో ఎన్ని రోజులు ఉన్నా స‌రే వారందరూ అర్హులే అని హోం శాఖ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

News January 13, 2025

టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్‌ను ప్రతిపాదించిన గంభీర్?

image

రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై BCCI తీవ్ర కసరత్తు చేస్తోంది. నిన్న, ఈరోజు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్‌లోడ్ ఎక్కువవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సెలక్షన్ కమిటీ తెరపైకి పంత్ పేరును తీసుకొచ్చిందని సమాచారం. అయితే గంభీర్ అనూహ్యంగా జైస్వాల్ పేరును ప్రతిపాదించారట. మరి దీనిపై BCCI ఏమంటుందో చూడాలి.