News December 4, 2024
పెళ్లి చూపుల్లోనే ఎంత మంది పిల్లలు కావాలన్నారు: మిథాలీ రాజ్

పెళ్లి చూపుల్లో తనకు ఎదురైన ఇబ్బందికర అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ గుర్తు చేసుకున్నారు. ‘నేను ఇండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడే పెళ్లిచూపులకు సిద్ధమయ్యా. పరిచయాలు అయిపోగానే నాతో మాట్లాడేవారు. పెళ్లయ్యాక క్రికెట్ వదిలేయాలని, ఎంత మంది పిల్లలు కావాలని, అత్తగారికి సేవలు చేయాలని అడిగేవారు. ఎవరో ఓ వ్యక్తి కోసం అన్నీ వదులుకోవడం నా వల్ల కాదు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
వాంఖడే పిచ్ ఎవరికి కలిసొస్తుందో?

ఈరోజు IND-ENG సెమీస్‌లో వాంఖడే పిచ్ కండీషన్ ముఖ్యపాత్ర పోషించనుంది. సాధారణంగా ఇది బ్యాటింగ్ పిచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు పరుగుల వరద పారించొచ్చు. అయితే ఇప్పుడు ఆ పిచ్‌పై పచ్చిక ఉండటం చర్చనీయాంశమైంది. దీనిపై కోచ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేయగా, సిబ్బంది పచ్చికను తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పచ్చిక ఎక్కువుంటే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అదే తేమ ఎక్కువైతే బ్యాటర్లకు కలిసొస్తుంది.
News March 5, 2026
ఇవాళ, రేపూ భారీ నష్టాలు తప్పవా?

ఇరాన్ వార్‌తో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చివరి 3 సెషన్లలో ఏకంగా రూ.21.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత శనివారం యుద్ధం ప్రారంభం కాగా మరుసటి రోజు ఆదివారం, 3న(మంగళవారం-హోలీ) మార్కెట్లకు సెలవులు కావడంతో మరింత భారీ నష్టం తప్పింది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ, రేపటి సెషన్లపై ‘బేర్’ పంజా తప్పేలా లేదు.
News March 5, 2026
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

<


