News March 7, 2025

దేశంపై ఎన్ని రూ.కోట్ల అప్పు ఉందంటే?

image

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుతూ వస్తున్నాం. అయితే, అభివృద్ధితో పాటు దేశంపై అప్పు కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండియాపై రూ.181 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు బడ్జెట్‌లో కేంద్రం తెలిపింది. ఇది వచ్చే ఏడాది వరకు రూ.196 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. కాగా, తెలంగాణపై రూ.5లక్షల కోట్లు, ఏపీపై రూ.9 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 21, 2025

చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది: అంబటి

image

AP: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే YCP MLAలు సభకు వెళ్లలేదని చెప్పారు. కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందన్నారు. స్కిట్స్‌లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారని, CBN శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు. YSR స్నేహితుడినని చెప్పుకునే ఆయన ఇప్పుడు వైఎస్సార్ జిల్లా పేరు మార్చారని మండిపడ్డారు.

News March 21, 2025

భాగస్వామికి దూరంగా ఉంటున్నారా?

image

ఒత్తిళ్లో, ఆర్థిక ఒడిదుడుకులో, అనారోగ్యాలో.. కారణాలేవైనా ఎన్నో జంటలు తమ రోజువారీ జీవితంలో దాంపత్య సుఖానికి దూరంగా ఉంటుంటాయి. అది ఏమాత్రం మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేకపోగా వారి మధ్య దూరం పెరిగి చికాకులు తోడవుతాయని వివరిస్తున్నారు. ఎన్ని బాధలు ఉన్నా పడకపై భాగస్వామి చెంతచేరి సేదతీరాలని, మరుసటిరోజుకు ఇది కొత్త ఉత్సాహాన్నిస్తుందని సూచిస్తున్నారు.

News March 21, 2025

రేపే ఎర్త్ అవర్.. లైట్లు ఆపేద్దామా..?

image

ప్రతి ఏటా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ జరుపుతుంటారు. ఆ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో లైట్లను ఆపేస్తారు. పర్యావరణ పరిరక్షణకు, భూతలతాపాన్ని నియంత్రించేందుకు ఈరోజును ప్రారంభించారు. ప్రజలు స్వచ్ఛందంగా లైట్లు ఆపి ఈరోజును పాటించాలని AP గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కాగా.. ఢిల్లీ ప్రభుత్వం ఎర్త్ డేను పాటిస్తూ రేపు రాత్రి ఆ గంట సేపు లైట్లను ఆపేయనుంది.

error: Content is protected !!