News August 11, 2024

ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఎన్ని పతకాలంటే?

image

పారిస్ ఒలింపిక్స్‌ మరికాసేపట్లో ముగియనుండగా విశ్వక్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. ఇండియా మొత్తం 6 మెడల్స్ సాధించి టేబుల్‌లో 71వ స్థానంలో నిలిచింది. ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు. గత టోక్యో ఒలింపిక్స్‌‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు. మిగతా 5 మెడల్స్ కాంస్యాలే. ఇందులో మనూ భాకర్ 2, సరబ్‌జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే, హాకీ టీమ్, అమన్ తలో మెడల్ గెలిచారు.

Similar News

News September 19, 2024

ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ బంగ్లాదేశ్’

image

బంగ్లాదేశ్‌తో ఈరోజు ఉదయం టెస్టు మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ బంగ్లాదేశ్’ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బంగ్లా అల్లర్లలో హిందువులపై ఘోరంగా దాడులు జరిగాయని, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాక్‌ తరహాలోనే ఆ దేశంతో కూడా క్రికెట్‌ ఆడకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే క్రీడల్ని, రాజకీయాల్ని ముడిపెట్టకూడదంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

News September 19, 2024

పంత్‌తో డేటింగ్.. అవి రూమర్లే: ఊర్వశి

image

భారత క్రికెటర్ రిషభ్ పంత్‌తో తాను డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నటి ఊర్వశీ రౌతేలా స్పష్టం చేశారు. ‘నేను నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా కెరీర్‌పైనే ఉంది. పంత్‌ విషయంలో వచ్చినవన్నీ రూమర్లే. వాటిపై పారదర్శకత మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మీమ్ పేజీలకు ఎందుకింత అత్యుత్సాహమో నాకు అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.

News September 19, 2024

పవన్‌తో ముగిసిన బాలినేని, సామినేని భేటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ ముగిసింది. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ఉదయభాను ప్రకటించారు. జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మరోవైపు త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్‌ను ఆహ్వానించి జనసేనలో చేరతానని బాలినేని తెలిపారు. అందరినీ కలుపుకుని ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.