News November 19, 2024
ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి?: వైసీపీ
AP: రాష్ట్రంలో ఆడబిడ్డలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని YCP విమర్శించింది. బాపట్లలో మతిస్థిమితం లేని 11 ఏళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారని, నిందితుడిని పోలీసులకు అప్పగించారని ట్వీట్ చేసింది. ‘మీ చేతగానితనంతో ఇంకెంత మంది ఆడబిడ్డలు ఇలాంటి కామాంధులకి బలవ్వాలి?’ అని CM CBN, Dy.CM పవన్, హోంమంత్రి అనితను ప్రశ్నించింది.
Similar News
News November 19, 2024
ఈనెల 26న గ్రూప్-4 నియామక పత్రాల అందజేత?
TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఈనెల 26న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 14న గ్రూప్-4 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా, 8084 మంది ఎంపికైన సంగతి తెలిసిందే.
News November 19, 2024
ACA ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా మిథాలీ
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో మహిళల క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి, వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు ఆమె ACAతో కలిసి మూడేళ్లు పని చేయనున్నారు. అనంతపురంలో హై-పెర్ఫార్మెన్స్ అకాడమీని ఏర్పాటు చేసి, 80 మంది బాలికలను ఎంపిక చేసి 365 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ACA తెలిపింది.
News November 19, 2024
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!
JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.