News November 19, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!

image

JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.

Similar News

News December 8, 2024

సోనియా గాంధీపై బీజేపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

image

NDA ప్రభుత్వాన్ని అస్థిర‌ప‌రిచే కుట్ర‌లు జ‌రుగుతున్నాయంటూ అమెరిక‌న్ సంస్థ‌లు, జార్జ్ సోరోస్‌, రాహుల్ గాంధీపై ఆరోప‌ణ‌లు చేస్తున్న BJP తాజాగా సోనియా గాంధీని టార్గెట్ చేసింది. క‌శ్మీర్‌ను స్వ‌తంత్ర దేశంగా భావించే FDL-AP ఫౌండేష‌న్‌కు జార్జ్ సోరోస్ నుంచి నిధులు అందాయని, దీనికి సోనియా కో-ప్రెసిడెంట్ అని ఆరోపించింది. ఇది దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో విదేశీ హ‌స్తం ఉందనడానికి రుజువని పేర్కొంది.

News December 8, 2024

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్!

image

‘పుష్ప-2’ ప్రీమియర్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద <<14793383>>తొక్కిసలాటలో మహిళ<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమాని‌తోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు అతని టీమ్‌పైనా కేసు నమోదైంది.

News December 8, 2024

నటి ధరించిన చెప్పులకు వేలంలో రూ.237 కోట్లు

image

ప్రముఖ US నటి జూడీ గెరాల్డ్ The Wizard of Oz చిత్రంలో ధరించిన రూబీ స్లిప్పర్స్ వేలంలో $28 మిలియన్ల(రూ.237 కోట్లు)కు అమ్ముడుపోయాయి. అన్ని రకాల ఫీజులతో కలిపి $32.5Mను ఓ వ్యక్తి చెల్లించాడు. అతని పేరు బయటికి వెల్లడికాలేదు. 2005లో మ్యూజియం నుంచి వీటిని దుండగులు దొంగిలించగా 2018లో FBI రికవరీ చేసింది. తాజాగా ఓ సంస్థ ఈ స్లిప్పర్స్‌ను వేలం వేయగా రికార్డు స్థాయి ధర దక్కింది.