News October 12, 2024
ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే పాఠాలు నేర్చుకుంటారు?: రాహుల్ గాంధీ
మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్నటి రైలు ప్రమాదం బాలాసోర్ ఘోర ప్రమాదాన్ని గుర్తుచేసింది. లెక్కలేనన్ని ప్రమాదాల్లో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పాఠాలు నేర్చుకోవడం లేదు. జవాబుదారీతనం అనేది పైనుంచే మొదలవుతుంది. ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే ఈ సర్కారు కళ్లు తెరుస్తుంది?’ అని మండిపడ్డారు.
Similar News
News November 12, 2024
సచిన్, కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గుర్బాజ్
బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో సెంచరీ చేసిన అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. వన్డేల్లో అతి తక్కువ వయసు(22Y 349D)లో 8 సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. ఈ క్రమంలో సచిన్(22Y 357D), కోహ్లీ(23Y 27D)లను అధిగమించారు. సౌతాఫ్రికా క్రికెటర్ డికాక్ 22Y 312Dలోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నారు. కాగా మూడో వన్డేలో గెలిచిన అఫ్గాన్ 2-1తో సిరీస్ గెలుచుకుంది.
News November 12, 2024
శాంసన్‌పై ప్రశ్నకు మనసులు గెలిచేలా గౌతీ జవాబు
సంజూ శాంసన్ వరుస సెంచరీల వెనక తన ఘనతేమీ లేదని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. అదంతా అతడి ప్రతిభేనని ప్రశంసించారు. ‘సంజూ ఫామ్ కోసం నేను చేసిందేమీ లేదు. అతడు సమర్థుడు. మనం చేయాల్సిందల్లా అతడిని సరైన స్థానంలో క్రీజులోకి పంపించి ఎంకరేజ్ చేయడమే. సంజూ చాలా శ్రమిస్తారు. ఇది అంతం కాదు ఆరంభం. భారత్ కోసం అతడిలాగే ఆడాలని కోరుకుంటున్నా. ప్రెజర్లోనూ యువ ఆటగాళ్లు రాణించడం శుభసూచకం’ అని పేర్కొన్నారు.
News November 12, 2024
వందేభారత్ ఫుడ్.. పనీర్ కర్రీ చూడండి!
వందేభారత్ రైళ్లలో ఫుడ్ దారుణంగా ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. రూ.220 తీసుకుని నాసిరకం ఆహారం పెడుతున్నారని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పనీర్ కర్రీ నీళ్లలాగా ఉందని, దీన్ని ఎలా తినాలని ప్రశ్నించారు. మెనూ ఛాయిస్ కూడా ఉండట్లేదని వాపోయారు. రైళ్లలో కంటే ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్లడం బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.