News April 13, 2024

ఏ పార్టీ ఏలుబడిలో ఎంతమంది!

image

భారతదేశ జనాభా దాదాపు 142.86 కోట్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో.. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ప్రజల్ని పాలిస్తున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ప్రజల్ని BJP పరిపాలిస్తోంది. జనాభాలో 42.5% మంది BJP ఏలుబడిలో ఉన్నారు. జనతాదళ్(యు) 9.1%, శివసేన 9%, కాంగ్రెస్ 8.3%, TMC 7.3%, DMK 5.7%, YCP 3.9%, AAP 3.6%, బిజూ జనతా దళ్ 3.4%, ఝార్ఖండ్ ముక్తి మోర్చా 2.8% మంది ప్రజల్ని పరిపాలిస్తోంది.

Similar News

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 11, 2026

నేడు కేరళ, తమిళనాడుకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం కేరళలోని కొచ్చిలో ₹10,800కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం TNలోని తిరుచిరాపల్లిలో ₹5,650కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు ముందే మధురై ఎయిర్‌పోర్టుకు కేంద్రం అంతర్జాతీయ హోదాను ప్రకటించింది. ఈ విజిట్‌తో మోదీ ఇరు రాష్ట్రాల్లో అధికారికంగా NDA ఎన్నికల ఢంకా మోగించనున్నట్లు తెలుస్తోంది.

News March 11, 2026

ఈరోజు నమాజ్ వేళలు (11-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.