News April 25, 2024
మూడో దశ ఎన్నికల బరిలో ఎంతమంది అంటే?

మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో 1,351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ పేర్కొంది. కాగా ఈ స్థానాలకు మే 7న ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి 95 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నిన్న గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.
Similar News
News April 17, 2026
తాత్కాలిక సీజ్‌ఫైర్‌లు మాకొద్దు: ఇరాన్

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10రోజుల సీజ్‌ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ నుంచి మొదలుకొని ఎర్రసముద్రం వరకు ఈ ఏరియాలో ఎలాంటి అశాంతి లేకుండా ఉండటమే తమకు కావాలని స్పష్టం చేసింది. తాత్కాలిక సీజ్‌ఫైర్‌లను ఒప్పుకోబోమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న హింస ఇక్కడితో శాశ్వతంగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ వెల్లడించారు.
News April 17, 2026
రాహుల్ గాంధీకి షాక్

రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాకిచ్చింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశించింది. కాగా రాహుల్‌కు బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ 2024లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ పౌరసత్వం అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇది నిషేధం.
News April 17, 2026
హీరోయిన్ పెళ్లి వార్తలు.. ఖండించిన తల్లి

మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తలను ఆమె తల్లి లిస్సీ ఖండించారు. వారి మ్యారేజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఓ వ్యక్తి SMలో చేసిన కామెంట్‌కు ఆమె ‘ఫాల్స్ న్యూస్’ అని ఆన్సరిచ్చారు. 2022లో వచ్చిన హృదయం మూవీలో వీరిద్దరూ మ్యారీడ్ కపుల్‌గా నటించారు. ఆ సమయంలో ప్రేమ చిగురించిందని రూమర్లు వచ్చాయి. కాగా గతేడాది లోక: చాప్టర్-1తో కళ్యాణి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.


