News October 2, 2024
ఈ ఏడాది వర్షాలతో ఎంతమంది చనిపోయారంటే..
ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.
Similar News
News October 8, 2024
అందరి చూపు జమ్మూకశ్మీర్ పైనే..
దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో దేశం మొత్తం చూపు జమ్మూకశ్మీర్ వైపే ఉంది. ఇవాళ ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడవచ్చని చెప్పినా తమదే విజయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో హంగ్ ఏర్పడితే గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. దీంతో బీజేపీకి లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 8, 2024
ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్
TG: కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ <
News October 8, 2024
నేడే రిజల్ట్స్: గెలుపెవరిదో?
హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.