News November 20, 2024
మీ నిర్లక్ష్య వైఖరికి ఎంత మంది బలికావాలి?: హరీశ్ రావు

TG: నారాయణపేట(D) మాగనూర్ ZP స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు <<14664383>>అస్వస్థతకు<<>> గురవడంపై హరీశ్ మండిపడ్డారు. ‘వాంకిడి స్కూల్‌లో ఫుడ్ పాయిజన్‌తో పిల్లాడు వెంటిలేటర్‌పై ఉన్నాడు. నల్గొండలో పాము కాటుతో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు మరో ఘటన జరిగింది. మీ నిర్లక్ష్య వైఖరికి ఎంతమంది బలికావాలి? ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుకునేది?’ అని నిలదీశారు.
Similar News
News April 16, 2026
రాబోయే 2 గంటల్లో వర్షం

TG: వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాల వల్ల ఉక్కపోత, వేడి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
News April 16, 2026
మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News April 16, 2026
దక్షిణాదికి అన్యాయం జరగదు: మోదీ

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని.. తమకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలనే భేదం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. రాజకీయాల్లో తమ శక్తి చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.


