News January 23, 2025
దావోస్ ఖర్చెంత? పెట్టుబడులు ఎన్ని?: అంబటి

AP: దావోస్ నుంచి ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులు తెచ్చిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘దావోస్ వెళ్లి రావడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దావోస్ నుంచి పెట్టుబడులు ఏ మేరకు తెచ్చారు? తెలియపరిస్తే వినాలని ఉంది!’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 9, 2025
చిలుకూరు అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్‌పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
News February 9, 2025
వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో మాదే అధికారం: ధర్మేంద్ర ప్రధాన్

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. 2019 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ 30-40 శాతంగా ఉంటోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు మరో 10శాతం ఓట్లు అవసరమని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సీఎం మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
News February 9, 2025
గ్రేట్.. చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ

HYD నార్సింగిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డా.భూమిక (కర్నూలు) చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయ్యారు. దీంతో జీవన్‌దాన్, అవయవ దానం కోసం వారి కుటుంబసభ్యులను సంప్రదించగా.. తీవ్రమైన దుఃఖంలోనూ వారు అంగీకరించారు. దీంతో భూమిక గుండె, లివర్, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులను ఇతర వ్యక్తులకు అమర్చారు. మరణంలోనూ డాక్టరమ్మ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.