News December 16, 2024
బిగ్‌బాస్ విన్నర్‌కు ఎంత వచ్చాయంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734283300285_81-normal-WIFI.webp)
బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్‌గా నిఖిల్ నిలిచారు. ఆయనకు నాగార్జున, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందించారు. దీంతో పాటు మారుతీ సుజుకీ డిజైర్ కారును గిఫ్ట్‌గా అందించారు. వీటితో పాటు ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్నందుకు వారానికి రూ.2.25లక్షల చొప్పున 15 వారాలకు రూ.33.75 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా కారుతో పాటు రూ.88 లక్షలు వెనకేశాడు నిఖిల్.
Similar News
News January 20, 2025
పవిత్రతో రిలేషన్‌పై నరేశ్ ఆసక్తికర కామెంట్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737315204846_1226-normal-WIFI.webp)
నటి పవిత్ర వచ్చాక తన జీవితం కాస్త మెరుగుపడిందని సినీ నటుడు నరేశ్ చెప్పారు. ఇప్పుడు లైఫ్ టైటానిక్ ఒడ్డుకు చేరినట్లుగా ఉందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగిస్తామన్నారు.
News January 20, 2025
ఇండియా కూటమిలో చేరాలని విజయ్‌కి ఆఫర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737319410966_1226-normal-WIFI.webp)
విభజన శక్తులతో పోరాడేందుకు ఇండియా కూటమిలో చేరాలని తమిళగ వెట్రి కజగం చీఫ్, సినీ నటుడు విజయ్‌ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై కోరారు. ఇటీవల ఓ సభలో దేశంలో విభజన శక్తులు ఉన్నాయని విజయ్ అన్నారు. అలాంటి శక్తులను నిర్మూలించి, దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు తమతో చేరాలని కాంగ్రెస్ చీఫ్ సూచించారు. అయితే రాహుల్‌పై విజయ్ కొంత నమ్మకం ఉంచాలని TN బీజేపీ చీఫ్ అన్నామలై వ్యంగ్యస్త్రాలు సంధించారు.
News January 20, 2025
ఇలాంటి అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు: ఈటల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737313288631_1226-normal-WIFI.webp)
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం లేకుండా పనిచేయడం లేదని విమర్శించారు. ఇళ్ల దగ్గరే నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యంత అసమర్థ, అవినీతి, సమన్వయం లేని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, మూసీ పక్కన ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసి ఇప్పుడు జవహర్ నగర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.