News February 3, 2025
క్రీడలకు కేంద్రం ఎంత కేటాయించిందంటే?
2025-26 ఏడాదికి కేంద్రం బడ్జెట్ విడుదల చేయగా అందులో క్రీడా మంత్రిత్వ శాఖకు రూ.3,794.30 కోట్లు కేటాయించింది. దీనితో చైనా బడ్జెట్ను పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చైనా ప్రభుత్వం రూ.27,741 కోట్లు క్రీడల కోసమే కేటాయించింది. క్రీడాకారులకు సరైన వసతులు కల్పించేలా బడ్జెట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 ఒలింపిక్స్లో చైనాకు 91 మెడల్స్ వస్తే, ఇండియాకు 6 మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 3, 2025
అభిషేక్ ఊచకోతకు బౌలర్లు చేతగానివాళ్లలా కనిపించారు: పీటర్సన్
నిన్నటి మ్యాచ్లో అభిషేక్ సెంచరీతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించారు. ‘పిచ్ బ్యాటింగ్కు బాగుంది కరెక్టే. కానీ అటువైపు ఇంగ్లండ్ బౌలర్లేం తక్కువవారు కాదు. అలాంటి ఆటగాళ్లు కూడా అతడి విధ్వంసాన్ని చేతగానివాళ్లలా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఇక వరుణ్ చక్రవర్తి సైతం అద్భుతమైన బౌలింగ్ వేశారు. అతడిని ఆడటం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
EAPCET షెడ్యూల్ ఖరారు
తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.
News February 3, 2025
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఉత్కంఠ
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, అర్వింద్, రామచంద్రరావు రేసులో ఉండగా, కొత్తగా తెరపైకి మురళీధర్రావు, డీకే అరుణ పేర్లు వచ్చాయి. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. OCలకు దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీలకే అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేకుండా ప్రకటించాలని భావిస్తోంది.