News February 26, 2025

ఏ వయసు వారు ఎంత నూనె వాడాలి?

image

PM మోదీ ఇటీవల ఊబకాయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వంట నూనెల వాడకం తగ్గించాలన్నారు. ఈ క్రమంలో నూనె వాడాలా? వద్దా? వాడితే ఎంత వాడాలి? అనే చర్చ జరుగుతోంది. ఒక గ్రాము నూనెలో 9 క్యాలరీలు ఉంటాయి. ఆయిల్ మంచి క్యాలరీ సోర్స్‌. అయితే వయసుల వారీగా పరిమితంగా తీసుకోవాలి.
* 6-19 ఏళ్లు: రోజుకు 20- 25గ్రా.(4-5 టీస్పూన్లు)
* 20-59ఏళ్లు: రోజుకు 25-30గ్రా.(5-6 టీస్పూన్లు)
* 60yrs+: రోజుకు 20-25గ్రా.(4-5 టీస్పూన్లు)

Similar News

News March 15, 2025

ఆయుర్దాయం పెరగాలంటే ఇలా చేయండి!

image

ఫ్యామిలీతో కలిసి ఎక్కువకాలం బతకాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యం కావాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో 80 శాతం నిండినంత వరకే తినాలి. టీవీ, ఫోన్ చూడకుండా నెమ్మదిగా కింద కూర్చునే తినాలి. హెర్బల్ టీ తాగాలి. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. సమీపంలోని ప్రదేశాలకు నడక ద్వారానే వెళ్లాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

News March 15, 2025

వాళ్లే జనసేన MLAలు: అంబటి రాంబాబు

image

AP: తన సిద్ధాంతం ఏంటో తెలియని స్థితిలో Dy.CM పవన్ ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్‌రేట్ అని మాట్లాడుతున్నారు. గెలిచిన వారిలో అసలైన జనసేన నేతలు ఎంతమంది? YCP టికెట్ రాని, చంద్రబాబు మనుషులే జనసేన MLAలు. 2 పార్టీలు వాపును చూసి బలం అనుకుంటున్నాయి. జనసేన MLAలు దోపిడీ చేస్తుంటే పవన్ చుక్కలు లెక్కబెడుతున్నారు’ అని విమర్శించారు.

News March 15, 2025

రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

image

TG: గోషామహల్ BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వస్తే MIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఒవైసీ దేశాన్ని వదిలిపోయేలా చేస్తానని హెచ్చరించారు. ‘లేదంటే BJPలో చేరతానని మా నేతల కాళ్లు పట్టుకునేలా చేస్తాను. హోలీ జరగనివ్వకూడదని, నగరంలో హింస సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ ఆయనకు మెంటల్ హాస్పిటల్లో చికిత్స ఇప్పించాలి’ అని సూచించారు.

error: Content is protected !!